వర్షం పడుతుందని.. బయటికి వెళ్లొద్దని తల్లి హెచ్చరించడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలో నాలుగు ఐదు రోజుల నుండి వానలు దంచి కొడుతున్నాయి. అయితే బయటకు వెళ్లాలనుకున్న మహిళను తల్లి వద్దని హెచ్చరించింది. అంతే దీనికి మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్బీటీ నగర్‌కు చెందిన గాయత్రి.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఈమె భర్త సువిర్, ఇద్దరు పిల్లలు, ఆమె తల్లి మహాదేవమ్మాతో కలిసి నివసిస్తోంది.
అయితే గురువారం పెద్దకూతురును బయటకు తీసుకెళ్తాను అని గాయత్రి అనడంతో తల్లి మహదేవమ్మ దానికి అంగీకరించలేదు. పైగా వర్షం పడడంతో ఎక్కడకు వద్దని గాయత్రిని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన గాయత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.