టెక్నాలజీ మనిషి ఎదుగుదలకు మాత్రమే కాదు.. వినాశనానికి కూడా దారితీస్తుంది. తాజాగా ఓ యువకుడు అందుబాటులోకి వచ్చిన ట్రాక్ వ్యూ అనే యాప్ టెక్నాలజీతో యువతుల అర్థనగ్న ఫోటోలు తీసి.. కోర్కె తీర్చమని వేధించి చివ
టెక్నాలజీ మనిషి ఎదుగుదలకు మాత్రమే కాదు.. వినాశనానికి కూడా దారితీస్తుంది. తాజాగా ఓ యువకుడు అందుబాటులోకి వచ్చిన ట్రాక్ వ్యూ అనే యాప్ టెక్నాలజీతో యువతుల అర్థనగ్న ఫోటోలు తీసి.. కోర్కె తీర్చమని వేధించి చివరకు జైలుపాలయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే..
తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్ కుమార్ ఎంసీఏ చదివాడు. బంధువుల పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే అమ్మాయిలు, వివాహితులతో చనువుగా మాట్లాడేవాడు. ఫోన్‌కాల్ చేయాలని వారి ఫోన్ అడిగి తీసుకుని 'ట్రాక్ వ్యూ' అనే రహస్య యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసేవాడు. ఆ తర్వాత ఆఫోన్‌ను తన ఫోన్‌తో అనుసంధానం చేసేవాడు.
దీంతో ఆ అమ్మాయిల ఫోన్లలోని వ్యక్తిగత సంభాషణలు, అర్థనగ్న ఫొటోలు, వీడియోలు దినేశ్ ఫోన్‌లోకి చేరేవి. ఈ ఫోటోలను చూపించి తన కోర్కె తీర్చాలంటూ బెదిరించసాగాడు. ఇలా చాలా మంది అమ్మాయిలనేకాకుండా మహిళను కూడా బెదిరించి తన శరీరవాంఛ తీర్చుకున్నాడు.
ఈ క్రమంలో ఓ యువతికి దినేశ్ ఫోన్‌చేశాడు. దీంతో సదరు యువతి తన సమస్యను సోదరికి చెప్పింది. సోదరి సలహాతో దినేశ్‌ను ఓ చోటికి రావాలని కోరింది. అక్కడికొచ్చిన దినేశ్‌ను చూసి బాధితురాలు, ఆమె సోదరుడు, బంధువులు విస్తుపోయారు. వరుసకు తమ్ముడైన వ్యక్తే ఇలా దారుణానికి పాల్పడటంతో దినేశ్‌ను చావబాది పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.