ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే కుమార్తెతో బీఎస్పీ నేత కుమారుడి వివాహం... మాయావతి ఆగ్రహం!!

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (14:08 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)లు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ రెండు పార్టీల నేతలకు ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడదు. అలాంటి ఎస్పీకి చెందిన ఎమ్మెల్యే కుమార్తెను బీఎస్పీ నేత తన కుమారుడు ఇచ్చిన వివాహం చేశారు. ఈ విషయం ఆ పార్టీ అధినేతి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి దృష్టికి వెళ్లింది. అంతే.. ఆమె ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహోద్రుక్తులయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కుమార్తెను ఇంటి కోడలిని చేసుకున్న బీఎస్పీ నేతను పార్టీ నుంచి ఆమె బహిష్కరించారు. ఈ అంశం ఇటు పార్టీలోనే కాకుండా అటు రాష్ట్ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. 
 
మాయవతి సారథ్యంలోని బీఎస్పీలో ఒకప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన త్రిభువన్ దత్తా కుమార్తెతో బీఎస్పీ సీనియర్ నేత అయిన సురేంద్రసాగర్ తన కుమారుడు అంకుర్ వివాహం జరిపించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అయిన మాయవతికి ఇది కోపం తెప్పించింది. తన వ్యతిరేక వర్గానికి చెందిన పార్టీ నేతతో వియ్యం అందుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. సాగర్‌ను రాంపూర్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
 
బరేలీ డివిజన్కు చెందిన సురేంద్రసాగర్ గతంలో కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు. పార్టీలో కీలక పదవులు నిర్వర్తించారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. అయితే, ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ నేతతో సంబంధం కలుపుకోవడం, వివాహానికి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరు కావడంతో ఆగ్రహించిన మాయావతి పార్టీ నుంచి సురేంద్ర సాగర్‌ను బహిష్కరించారు. అయితే, తానేమీ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడలేదని, తన కుమారుడికి పెళ్లి మాత్రమే జరిపించానని సాగర్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments