Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వచ్చిన 10వ తరగతి విద్యార్థితో రాత్రంతా చాటింగ్..

Webdunia
గురువారం, 4 మే 2023 (19:33 IST)
తమిళనాడు, తిరుచ్చిలో ట్యూషన్‌కు వచ్చిన 10వ తరగతి విద్యార్థితో రాత్రంతా అభ్యంతరకరంగా చాట్ చేసిన ఓ టీచర్‌ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా, ఉప్పిలియపురం సమీపంలోని వెలయపట్టికి చెందిన దేవి (40). తరుయూర్‌లోని ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 
 
గత కొన్ని నెలలుగా మనస్పర్థల కారణంగా భర్తతో కలిసి విడివిడిగా ఈమె జీవిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన వద్ద చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థితో ఆమె చాటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. 
 
తన కుమారుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడి తల్లిదండ్రులు కుమారుడిపై కన్నేసి వుంచారు. అప్పుడు అర్థరాత్రి దాటాక ఉపాధ్యాయురాలు దేవితో పదో తరగతి విద్యార్థి సెల్ ఫోన్‌లో చాలాసేపు అసభ్యకరంగా చాట్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. 
 
దీంతో విద్యార్థి చదువుపై శ్రద్ధ చూపడం లేదని ఇందుకు ట్యూషన్ టీచర్ కారణమని తేలింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహిళా పోలీసులు ఉపాధ్యాయురాలు దేవిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విద్యార్థిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments