Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్.. ఏపీ వ్యాప్తంగా 9 మంది విద్యార్థులు సూసైడ్

suicide
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 63 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఈ పరీక్షల్లో కష్టపడి చదివి, ఎంతో బాగా రాసిన విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారు. ఇలాంటి పలువురు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 
 
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన అనూష (17) ఇంటర్ ఫెయిల్ కావడంతో గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సెలవుల కోసం కర్నాటకలోని అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఆమె ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో ఆమె అక్కడే ఈ దారుణానికి ఒడిగట్టింది. 
 
ఇకపోతే, చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన బాబు (17) అనే విద్యార్థి గణితంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో పరీక్షా ఫలితాలు విడుదలైన బుధవారం రాత్రే పురుగుల మందు సేవించి సూసైడ్ చేసుకున్నాడు. అలాగే, తనకు తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్థాపనంతో తులసీ కిరణ్ (17) అనే విద్యార్థి గురువారం ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఇకపోతే, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) అనే విద్యార్థి టెక్కలి గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి చనిపోయాడు. అలాగే, విశాఖపట్టణానికి చెందిన ఆత్మకూరు అఖిల శ్రీ (16), బోనెల జగదీశ్ (18), అనంతపురం జిల్లా కణేకల్లు మండలం, హనకనహాళ్ గ్రామానికి చెందిన మహేశ్ (17), ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన షేక్ జాన్ సైదా (16), అదే జిల్లాకు చెదిన రమణ రాఘవ (17)లు ఆత్మహత్య చేసుకున్నవారిలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య