Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో మహిళా జర్నలిస్టుతో రాసలీలలు.. ప్రముఖ చానెల్ న్యూస్ ఎడిటర్ అరెస్టు

తన వద్ద పని చేసే సీనియర్ మహిళా జర్నలిస్టును పెళ్లి పేరుతో మోసం చేసి తన కోర్కె తీర్చుకన్న కేసులో ప్రముఖ మలయాళ న్యూస్ చానెల్‌కు చెందిన న్యూస్ ఎడిటర్‌ను తిరువనంతపురం పోలీసులు అరెస్టు చేశారు.

Webdunia
బుధవారం, 26 జులై 2017 (13:17 IST)
తన వద్ద పని చేసే సీనియర్ మహిళా జర్నలిస్టును పెళ్లి పేరుతో మోసం చేసి తన కోర్కె తీర్చుకన్న కేసులో ప్రముఖ మలయాళ న్యూస్ చానెల్‌కు చెందిన న్యూస్ ఎడిటర్‌ను తిరువనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 
 
ప్రముఖ ఛానల్‌‌లో సీనియర్ న్యూస్ ఎడిటర్‌‌గా అమాల్ విష్ణుదాస్‌ పని చేస్తున్నారు. ఈయన తన కింద పని చేసే ఓ మహిళ జర్నలిస్టును పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, లైంగికంగా లోబర్చుకుని, మోసంచేశాడన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత జర్నలిస్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. 
 
ఈ ఫిర్యాదులో మొదటి భార్యతో విభేదాల కారణంగా త్వరలోనే ఆమెకు విడాకులిచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే  విడాకులు మంజూరైన తర్వాత మొహం చాటేయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అలాగే ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయనీ, కెరియర్‌ను నాశనం చేస్తానని హెచ్చరించడమే కాకుండా, తన తండ్రి వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు న్యూస్ ఎడిటర్‌ను అరెస్టు చేశారు. ఆయనను బుధవారం ఉదయం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఆయనపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 377 (అసహజ నేరాలు),  506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేశామని తిరువనంతపురం సీఐ రియాజ్‌ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం