Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో డీజిల్ క్యాబ్స్ నిషేధం.. ఆందోళనకు దిగిన డ్రైవర్లు.. స్తంభించిన హస్తిన

Webdunia
సోమవారం, 2 మే 2016 (15:47 IST)
దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ క్యాబ్స్‌పై సుప్రీంకోర్టు నిషేధం విధించడాన్ని క్యాబ్స్ డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉత్తర్వులకు నిరసనగా డ్రైవర్లు సోమవారం ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు దిగారు. దీంతో హస్తిన స్తంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 
 
ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలోని రాజోక్రి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో దౌలాకువాన్‌ నుంచి గుడ్‌గావ్‌ వెళ్లే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు గుడ్‌గావ్‌-దౌలాకువాన్‌ రోడ్డుపై పాత దిల్లీ టోల్‌ బూత్‌ వద్ద రహదారులు దిగ్బంధించారు. 
 
రోడ్లపై దాదాపు కిలోమీటరు మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఢిల్లీలో కాలుష్యనియంత్రణ కోసం డీజిల్‌ వాహనాలను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాహనాలను డీజిల్‌ నుంచి సీఎన్‌జీకి మార్చుకోవడానికి ఇంకా సమయం కావాలని పెట్టుకున్న పిటిషన్‌ను శనివారం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మే 1వ తేదీ నుంచి డీజిల్‌తో నడిచే క్యాబ్స్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా ఈ పరిస్థితి నెలకొంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments