బట్టతల వున్నవారికి ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. కేశ సంపద కోసం వారు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఐతే అప్పటివరకూ పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు కాస్తా ఊడిపోయి ఒక్కసారిగా బట్టతల అవుతుంటే కలిగే ఆందోళన వర్ణనాతీతం. ఇపుడు అటువంటి సమస్యను మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాలైన బోర్గావ్, కల్వాడ్, హింగ్నా ప్రజలు ఎదుర్కొంటున్నారు.
ఇక్కడ గత కొంతకాలంగా ప్రజలు అకస్మాత్తుగా జుట్టు రాలుతున్న సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి ఒక వ్యక్తికి మూడంటే మూడు వారాల్లో ఒత్తుగా వుండే జుట్టు కాస్తా ఊడిపోయి బట్టతల అయిపోయింది. దీనితో అక్కడివారంతా సమీప ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గ్రామాలను సందర్శించారు. ఎరువులు, కలుషితమైన నీరు, ఆరోగ్య సమస్యల కారణంగా ఇలా జరుగుతుందేమోనన్న కోణంలో పరీక్షలు చేస్తున్నారు. జుట్టు ఎందుకు రాలిపోతుందో త్వరలోనే తెలుసుకుని పరిష్కారం కనిపెడతామని అన్నారు.