Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. మాస్కులు ధరించాలా? వద్దా? కర్నాటక అడ్వైజరీ

hmpv virus

ఠాగూర్

, మంగళవారం, 7 జనవరి 2025 (09:41 IST)
చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడించింది. 2019లో వెలుగు చూసిన కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు అలాంటి వైరస్ ఒకటి చైనాలో పుట్టింది. ఈ వైరస్ ఇప్పటికే చైనాలో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇపుడు భారత్‌లోకి ప్రవేశించింది. దేశ వ్యాప్తంగా ఐదు కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో రెండు, తమిళనాడులో రెండు, గుజరాత్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు కేసులు నమోదైవున్నాయి. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ప్రజలను అలెర్ట్ చేసింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించింది. 
 
అయితే, హెచ్ఎంపీవీ వైరస్ కోవిడ్-19లా వ్యాప్తి చెందేది కాదని, కాబట్టి ఎవరూ భయపడవద్దని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అడ్వైజరీని విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించింది.
 
ఇది శ్వాసకోశ సంబంధిత వైరస్ అని వెల్లడించింది. ఈ వైరస్ ప్రాథమికంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని, వారిలో సాధారణ జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అడ్వైజరీలో పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజాలాంటి అనారోగ్యం, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వంటి కేసులను రిపోర్ట్ చేయాలని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
 
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కూడా సూచనలు చేసింది. ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మిన సమయంలో నోరు, ముక్కును కప్పి ఉంచుకోవాలని, తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సూచించింది. హెచ్ఎంపీవీ లక్షణాలు కలిగిన వారు, రోగులకు సన్నిహితంగా ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఉపయోగించిన టిష్యూ పేపర్లను మరలా వాడవద్దని, తవ్వాలు లేదా హ్యాండ్ కర్చీఫ్ ఒకరికి మించి ఉపయోగించవద్దని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దని విజ్ఞప్తి చేసింది.
 
హెచ్ఎంపీవీ సోకితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఫ్లూలాంటి లక్షణాలు కనబడతాయని వెల్లడించింది. మరింత తీవ్రమైన కేసుల్లో అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారిలో ఇది బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీసే అవకాశముందని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ప్రస్తుతానికి హెచ్ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్స, వ్యాక్సిన్ లేవని తెలిపింది. తగిన విశ్రాంతి తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వంటి చర్యలతో ఉపశమనం ఉంటుందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన బాలిక...