Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిచూపులోనే తాళి కట్టిన..

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:29 IST)
ఎవరిని చూస్తే గుండె వేగంగాకొట్టుకుంటుందో.. ఎవరితో మాట్లాడుతుంటే ప్రపంచమే మర్చిపోయాలే అనిపిస్తుందో.. కొంతమంది దాన్నే తొలిచూపు ప్రేమ అంటారు. మరికొంత మంది స్టయిల్‌గా ‘లవ్ యట్ ఫస్ట్ సైట్’ అని చెబుతుంటారు.
 
మరి లవ్ యట్ ఫస్ట్ సైట్‌లోనే ప్రేమ పుట్టిందంటూ అమ్మాయికి అబ్బాయి చెప్పి ఒప్పించినా.. పెళ్లి చేసుకోవటం మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఓ జంటకు మాత్రం ప్రేమతో పాటు పెళ్లి కూడా చకాచకా జరిగిపోయింది. ఆ అమ్మాయిని అతడు తొలిసారి చూడడం, పెళ్లికి ప్రపోజ్ చేయడం, ఆమె ఓకే అనడం.. అంతా ఓ ఫీల్‌గుడ్ మూవీ లవ్‌ స్టోరీలా సాగిన ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది.
 
హింద్‌ మోటార్ ప్రాంతానికి చెందిన సుదీప్ ఘోషల్‌కి షియోరాఫూలికి చెందిన ప్రతమా బెనర్జీ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది. మూడు నెలలుగా వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటున్నారు. ప్రతమా తన ఫ్రెండ్స్‌తో కలిసి కోల్‌కతా వచ్చిన సంగతి తెలియడంతో.. తనను కలుసుకోవాలంటూ సుదీప్ మెసేజ్ చేశాడు. దుర్గాష్టమి సందర్భంగా సంతోష్ మిత్రా స్క్వేర్ పూజా మండపం దగ్గర వీళ్లిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు.

ఆమెను చూసిన సుదీప్ లవ్ యట్ ఫస్ట్ సైట్‌లోనే ప్రేమ పుట్టిందంటూ అక్కడికక్కడే మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేశాడు. వెంటనే అతని ప్రేమకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రెండ్స్ అంతా ప్రోత్సహించడంతో అదే రోజు రాత్రి వీళ్లిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం సుదీప్ ఫార్మాసూటికల్ ఎగ్జిక్యూటివ్‌‌గా చేస్తున్నాడు. ఇక ప్రతమా ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. వధూవరులిద్దరి తరపు కుటుంబాలు వీరి పెళ్లిని సంతోషంగా అంగీకరించడంతో అదే రోజు అర్థరాత్రి పెళ్లిబాజాలు మోగాయి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments