Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడు.. కొడుకు కాదన్నాడు.. కూతుళ్లు తల్లికి పెళ్లి చేశారు

తల్లికి కుమార్తెలు వివాహం చేసిపెట్టారు. భర్తలేని తల్లికి తోడు కల్పించారు. భర్త చనిపోయినా తన బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది. తీరా కొడుకు ఎదిగాక.. కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో అనాథగా మారిన ఆ త

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:12 IST)
తల్లికి కుమార్తెలు వివాహం చేసిపెట్టారు. భర్తలేని తల్లికి తోడు కల్పించారు. భర్త చనిపోయినా తన బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది. తీరా కొడుకు ఎదిగాక.. కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో అనాథగా మారిన ఆ తల్లికి కూతుళ్లు అండగా నిలిచారు. తన తల్లికి మరోసారి వివాహం చేసి కొత్త జీవితాన్ని అందజేశారు. ఈ సంఘటన మీరట్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని జాగృతి విహార్‌కు చెందిన ఓ మహిళకు భర్త చనిపోయి... 15 సంవత్సరాలైంది. అయినా  బిడ్డల కోసం బతికింది. తన కాయకష్టంతో పిల్లలను పెంచి పెద్ద చేసింది. కుమార్తెలకు ఘనంగా వివాహం జరిపించింది. 
 
అయితే కొడుకు చెడు అలవాట్లకు లోనయ్యాడు. తల్లిని కొడుతుండేవాడు. ఒకరోజు కన్నతల్లిని బయటకు గెంటేశాడు. దీంతో ఆమె కుమార్తెలే ఆమెకు ఆశ్రయం కల్పించారు. తర్వాత వారు తల్లికి మంచి వరుడిని వెదికి పెళ్లి చేశారు. సుహారన్‌పూర్ నివాసి, వారి బంధువు అయిన వ్యక్తితో తల్లికి వివాహం జరిపించారు. ఆయనకు పెళ్లయినప్పటికీ భార్య చనిపోవడంతో ఈ వివాహానికి అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments