Webdunia - Bharat's app for daily news and videos

Install App

సకాలంలో ఫీజు చెల్లించలేదనీ ఆరో తరగతి విద్యార్థిని కొట్టి చంపిన స్కూలు అధికారులు!

మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు పిల్లోడి స్కూలు ఫీజు సకాలంలో చెల్లించలేని స్కూలు అధికారులు కొట్టి చంపిన దారుణ ఘటన మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో జరిగింది.

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (09:25 IST)
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు పిల్లోడి స్కూలు ఫీజు సకాలంలో చెల్లించలేని స్కూలు అధికారులు కొట్టి చంపిన దారుణ ఘటన మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... ఇంఫాల్ సమీపంలోని లాంగోల్‌లో రెసిడెన్షియల్ కిడ్స్‌ కేర్ స్కూలు ఉంది. ఇక్కడ సురేష్ తొంగ్‌బ్రమ్ అనే ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే, విద్యార్థి తల్లిదండ్రులు స్కూలు ఫీజుల చెల్లించలేక పోయాడు. దీంతో స్కూలు అధికారులు దారుణంగా కొట్టి చంపేశారు. 
 
దీనిపై విద్యార్థి తండ్రి బీరా తొంగ్‌బ్రమ్ స్పందిస్తూ.. ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించలేకపోయానని చెప్పాడు. తమ అబ్బాయి రెండేళ్ల క్రితం ఆ స్కూల్లో చేరాడన్నారు. ఫీజులు చెల్లించాలి లేదా పిల్లాడిని తీసుకెళ్లిపోవాలని వాళ్లు చెప్పారని, దాంతో ఏమీ చేయలేక తాను పిల్లాడిని తీసుకెళ్లిపోదామని స్కూలుకు వెళ్తే.. ఫీజులు చెల్లించనిదే తీసుకెళ్లడానికి వీల్లేదన్నారని ఆయన తెలిపారు.
 
శుక్రవారం రాత్రి స్కూలు వాళ్లు తన కొడుకును ఇంటికి తీసుకొచ్చారని, అతడి శరీరం అంతా వాతలు తేలి ఉన్నాయని.. ఏంటని అడిగితే క్రమశిక్షణ తప్పడం వల్ల శిక్షించినట్లు చెప్పారని అన్నారు. అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోతూ ఈనెల 31 లోగా మొత్తం ఫీజు చెల్లించాలని తనకు చెప్పారన్నారు. ఇంటికి రాగానే కుప్పకూలిపోయిన సురేష్.. ఆ మర్నాడే మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి అసహజ మరణం అని తేలితే మాత్రం స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments