మణిపూర్‌లో ఘోరం... బస్సు బోల్తా 15 మంది విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:05 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి. చనిపోయిన వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. మణిపూర్ రాష్ట్రంలోని నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కోసం ఇంఫాల్ నుంచి ఈ బస్సు బయలుదేరి లంగ్సాయి తుబంగ్ వద్ద బోల్తాపడింది. 
 
ఈ విద్యార్థులంతా యారిపోక్‌లోని తంబాల్ను హైయ్యర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు. ఎడ్యుకేషన్ టూర్ నిమిత్తం రెండు బస్సుల్లో ఖౌపుమ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై మణిపూర్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments