Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరించలేదని డాక్టర్‌ను అరెస్టు చేసిన వైద్యులు

Webdunia
గురువారం, 20 మే 2021 (10:58 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రెండో దశ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. దీంతో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వంటి అంశాలను ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. దీన్ని ఒక బాధ్యతగా భావించాలని చెపుతున్నాయి.
 
అయితే, ఈ సామాజిక బాధ్యతను మరిచిన ఓ డాక్టర్ మాస్క్ లేకుండానే ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. మాస్కు ధరించాలని అక్కడి సిబ్బంది ఎంత చెప్పినా పట్టించుకోలేదు. అంతేకాదు, వారితో గొడవకు దిగాడు. దీంతో చేసేదేమీ లేక వారు సదరు డాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు డాక్టర్ పేరు శ్రీనివాస్ కక్కిలియా. మంగళూరులో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సూపర్ మార్కెట్‌కు వెళ్లి రచ్చ చేశారు. 
 
ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా లక్షణాలు లేనప్పుడు మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మాస్క్ తప్పనిసరి అని చెప్పడం ఒక ఫూలిష్ రూల్ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments