Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను కాటేశాడు.. పాఠశాలలో చేర్పిస్తానని లాడ్జిలో అత్యాచారం చేశాడు..

కన్నబిడ్డను కాటేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడిగా మారిపోయాడు. లాడ్జిలో పెట్టి కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పారైలో చోటుచేసుకుంది. వివరాల్ల

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (16:49 IST)
కన్నబిడ్డను కాటేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడిగా మారిపోయాడు. లాడ్జిలో పెట్టి కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పారైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మనప్పారైలో నాగరాజ్ అనే వ్యక్తి కూలి పనిచేసుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందులో పెద్దకూతురు చదువును పక్కనబెట్టి తండ్రితో కూలీ పనులు చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఓ రోజు రాత్రి చెరకు తోటలో చెరుకు నరుకుతూ.. పెద్దకుమార్తెపై అత్యాచారం చేయబోయాడు నాగరాజు. కానీ అతని భార్య ప్రమీలా పెద్దగా కేకలు వేయడంతో.. పరారైనాడు. కొద్దిరోజుల తర్వాత తిరిగొచ్చిన నాగరాజు భార్య వద్ద క్షమాపణలు కోరాడు. ఆపై కూతురిని పాఠశాలలో చేర్పిస్తానని నమ్మబలికి తన వెంట తీసుకెళ్తానన్నాడు. అందుకు భార్య కూడా అంగీకరించింది. 
 
అలా కూతుర్ని తన వెంట తీసుకెళ్లిన నాగరాజ్ లాడ్జి గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగరాజ్ బారి నుంచి తప్పించుకున్న ఆతని పెద్దకూతురు తల్లివద్దకు చేరుకుంది. తల్లితో జరిగిందంతా చెప్పింది. దీంతో నాగరాజ్‌పై మహిళా పోలీస్ స్టేషన్లో ప్రమీల ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజ్‌ను అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులో హాజరు పరచి జైలుకు పంపారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments