Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

ఠాగూర్
ఆదివారం, 8 జూన్ 2025 (12:57 IST)
ఒక యేడాదికి రూ.20 లక్షల వరకు సంపాదిస్తున్నప్పటికీ ఒక ఇంటిని మాత్రం కొనుగోలు చేయలేకపోయానని ఓ టెక్కీ వాపోతున్నాడు. 'ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు' అని సామెత.. అయితే, పెళ్లి మాటెలా ఉన్నా నగరాల్లో ఇల్లు కట్టడం, కొనడం సామాన్య మద్యతరగతి వ్యక్తి కలగానే మిగిలిపోతోందని, ఆయన ఆ వేదన వ్యక్తం చేశాడు. 
 
గురుగ్రామ్ సిటీలో ప్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఓ టెక్కీ వాపోతున్నాడు. యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ సొంతంగా ఓ ప్లాటు కొనుక్కోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పరిస్థితిపై ఆయన స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ పోస్టు భారతీయ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలపై తీవ్ర చర్చకు దారితీసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అఖిలేశ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్  తన స్నేహితుడి పరిస్థితిని వివరిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశాడు. తన స్నేహితుడి వార్షిక వేతనం రూ.20 లక్షలు అని, పన్నులు, ఈపీఎఫ్ వంటివి పోను నెలకు సుమారు రూ.1.2 లక్షలు చేతికి వస్తాయని తెలిపాడు. అతను ఎలాంటి దుబారా ఖర్చులు చేయడని, సొంత కారు కూడా లేదని చెప్పాడు. పిల్లలు లేరని, కేవలం భార్య మాత్రమే ఉందని పేర్కొన్నాడు.
 
అయితే, గురుగ్రామ్‌లో అన్ని సౌకర్యాలున్న ఇల్లు కొనాలని ప్రయత్నిస్తే, ప్రాజెక్టుల ధరలు రూ.2.5 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయని అఖిలేశ్ తెలిపాడు. బ్రోచర్లలో ఇన్ఫినిటీ పూల్స్, జెన్ గార్డెన్స్, ఇటాలియన్ మార్బుల్స్, బయోమెట్రిక్ లిఫ్టుల వంటి ఆకర్షణలు ఉంటున్నాయని, ఇంత ఖరీదైన ఇల్లు కొంటే నెలనెలా జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతుందని, అత్యవసరాలకు కూడా డబ్బు మిగలదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
"మన దేశంలో 95 శాతం మంది కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ, నా స్నేహితుడు సొంత నగరంలో ఇల్లు కొనలేకపోతున్నాడు" అని అఖిలేశ్ తన పోస్టులో కామెంట్స్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. నగరాల్లో ఇళ్ల ధరలపై విస్తృత చర్చకు దారితీసింది. "కొన్ని నగరాల్లో అధిక జీతాలు కూడా సరిపోవడం లేదు, ఇది ఆశ్చర్యంగా ఉంది" అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, "హైదరాబాద్ వంటి నగరాల్లో ఓఆర్‌ఆర్ బయట ట్రిపులెక్స్ విల్లా ధరలు కూడా రూ.2.5 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఉన్నాయి. సామాన్యులకు ఇల్లు అనేది ఇక కలగానే మిగిలిపోతుంది" అని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments