Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Advertiesment
Pakistan love couple

ఐవీఆర్

, శనివారం, 31 మే 2025 (12:58 IST)
ఆసుపత్రిని క్లీన్ చేస్తుంటాడు ఆ యువకుడు. ఉదయాన్నే వచ్చి అన్ని గదులను శుభ్రం చేసిన తర్వాత అందరికీ టీ తీసుకుని ఇస్తుంటాడు. అతడు ఆసుపత్రిని ఎంతో శుభ్రంగా వుంచడంతో పాటు సమయానికి వైద్యులందరికీ టీ ఇస్తుంటాడు. ఇక అతడి ప్రవర్తన కూడా సింపుల్ సూపర్బ్. ఇతగాడిని ఆరు నెలలుగా గమనిస్తోంది ఆసుపత్రిలో పనిచేసే లేడీ డాక్టర్. అతడి ప్రేమలో పడిపోయింది. ఓరోజున అతడికి ప్రపోజ్ చేసింది. హౌస్ కీపింగ్ చేసే ఆ యువకుడు తనకు లేడీ డాక్టర్ ప్రపోజ్ చేయడంతో షాక్ అయ్యాడు. పూర్తి వివరాలు చూద్దాము.
 
పాకిస్తాన్‌ దేశంలోని ఓ ఆసుపత్రిలో డ్యూటీ వైద్యురాలిగా పనిచేస్తోంది కిష్వర్ సాహిబా ఎంబిబిఎస్. తాను పనిచేసే ఆసుపత్రిలోనే పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బందిలో ఒకడైన షాజాద్‌ను ప్రేమించింది. షాజాద్ గురించి తనకున్న అభిప్రాయాన్ని కిష్వర్ పంచుకున్నది. అతను తనకు హౌస్ కీపింగ్ క్లీనర్‌గా కనిపించడం లేదని చెప్పింది. షాజాద్ సింప్లిసిటీని చూసి తను ముగ్ధురాలినయ్యానని కిష్వర్ చెప్పింది. అతనికి మొదట తనే ప్రపోజ్ చేశాననీ, షాజాద్ తన ప్రతిపాదనకు వెంటనే బదులివ్వలేదనీ, ఆరు నెలల తర్వాత ఓకే చెప్పాడని వెల్లడించింది.
 
తన ప్రేమ సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఒక రోజు కిష్వర్ షాజాద్‌ను తన కార్యాలయానికి రమ్మని అడిగింది. షాజాద్ కొంచెం గందరగోళంగా ఫీలయ్యాడు. ఎందుకంటే సాధారణంగా, కిష్వర్ టీ తీసుకురావాలని లేదా గదిని శుభ్రం చేయమని అడుగుతుంది. కానీ ఆమె అతన్ని వేరే కారణంతో రమ్మని అడగడం ఇదే మొదటిసారి. అతడు రాగానే నేరుగా ఆమె అతనికి పెళ్లి ప్రపోజ్ చేసింది. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఐతే ఆమె స్నేహితులు, బంధువులు వారిని ఎగతాళి చేయడం ప్రారంభించారు. దాంతో ఆ జంట తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. షాజాద్ ఒక మందుల దుకాణాన్ని తెరిచాడు. ఇప్పుడు ఈ జంట ఒక క్లినిక్ తెరవాలని యోచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?