COVID-19: కర్ణాటకలో కోవిడ్ మరణం.. 70 ఏళ్ల రోగి మృతి.. 40 కొత్త కేసులు నమోదు

సెల్వి
సోమవారం, 30 జూన్ 2025 (11:35 IST)
కర్ణాటక బెళగావి జిల్లాలోని ఒక ఆసుపత్రిలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన వృద్ధుడు మరణించాడని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కర్ణాటక ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా ఈ మరణాన్ని ధృవీకరించారు. 
 
ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం, బెళగావిలోని బెనకనహళ్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రోగి బుధవారం రాత్రి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత మరణించాడు. అతను వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడని, చికిత్స కోసం బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జిల్లా ఆసుపత్రిలో చేరాడని తెలుస్తోంది. 
 
కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలినప్పుడు, అతన్ని వెంటనే కోవిడ్ వార్డుకు తరలించినట్లు వర్గాలు తెలిపాయి. మే 17న, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీవ్రమైన కోమోర్బిడిటీలతో ఉన్న 84 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అతని మరణం తర్వాత అతని కోవిడ్-19 పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి. 
 
ఆరోగ్య శాఖ బులెటిన్ మే 28 నాటికి కర్ణాటకలో యాక్టివ్ కోవిడ్-19 కేసులు 126గా గుర్తించింది. ఆ రోజు 40 కొత్త కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments