Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణేలో ప్రేమోన్మాది ఘాతుకం.. పొట్ట, ఎద భాగాలను చీల్చి...22సార్లు..?

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:42 IST)
పుణేలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై విరుచుకుపడ్డాడు. ప్రేమించమని వేధించాడు. కానీ ఆమె నో చెప్పడంతో ఉన్మాదిగా మారిపోయాడు. ఏకంగా స్కూలుకే వెళ్లి తోటి విద్యార్థులు 20 మంది చూస్తుండగానే ఆమెను కసితీరా పొడిచేశాడు. పొట్ట, ఎద భాగాలను చీల్చేసే ప్రయత్నం చేశాడు. వెన్నుపూస, మణికట్టు దగ్గర కూడా కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ దుర్ఘటన పూణేలో చోటుచేసుకుంది. 
 
పుణె శివారు వడ్గావ్ షెరీలో.. లేడీ తెహరున్నీసా ఇమాందార్ స్కూల్లో పదవ తరగతి చదువుతోన్న ఓ విద్యార్థిని స్కూల్ ఆవరణలోనే కత్తిపోట్లకు గురైంది. కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తోన్న 22 ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సోమవారం స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఫేర్ వెల్ పార్టీ జరిగింది. ఆ పార్టీకి వెళ్లిన సైకో ప్రేమికుడు అమ్మాయిని 22సార్లు పొడిచాడు. 
 
పిల్లలంతా చిన్నవాళ్లే కావడంతో వాణ్ని పట్టుకునే సహాసం చేయలేకపోయారు. రక్తంతో తడిచిపోయిన బాదితురాలిని స్కూల్ యాజమాన్యం సమీపంలోని ఆస్పత్రి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులకు కూడా కబురుపెట్టారు.
 
బాలికకు తగిలిన కత్తిపోట్లలో నాలుగు లోతైన గాయాలున్నాయని, ఆపరేషన్‌కు డాక్టర్లు ఏర్పాట్లుచేశారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. స్కూలులో బాలికను పొడిచి పారిపోయిన తర్వాత నిందితుడు తన ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
 
అపస్మారకస్థితిలో అతణ్ని కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించారు. అతను డిశ్చార్జ్ అయ్యాక అరెస్ట్ చేస్తామని, స్పృహలోకి వచ్చాక విచారణ చేస్తామని, బాలిక కోలుకున్న తర్వాత ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments