Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లికి నో చెప్పిందని.. 12సార్లు కత్తితో పొడిచిన యువకుడు.. కేక్‌ను బలవంతంగా తినిపించి?

తాను చేసిన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఓ యువకుడు 21 ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా 12 కత్తిపోట్లు పొడిచిన ఉదంతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ పోలీసు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (11:37 IST)
తాను చేసిన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఓ యువకుడు 21 ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా 12 కత్తిపోట్లు పొడిచిన ఉదంతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ పోలీసు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టరు కుమారుడైన అమిత్ నాలుగు నెలల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.

అయినా అమిత్ తన బంధువు అయిన మరో యువతిని పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. అయితే తాను చేసిన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో అమిత్ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వచ్చి 12 పోట్లు పొడిచి పారిపోయాడు. 
 
అమిత్ జనవరి 6వ తేదీన జన్మదినం సందర్భంగా కూడా సల్ఫాస్ విషపు మాత్రలు కలిపిన కేక్‌ను బలవంతంగా యువతికి తినిపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కత్తిపోట్లతో తీవ్ర గాయాల పాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు అమిత్‌ను అరెస్టు చేసి ఆయనపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments