Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంసారానికి రాలేదని, స్నేహితులతో కలిసి వెళ్లాడు.. భార్యను తుపాకీతో కాల్చేశాడు..

Wife
Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (12:53 IST)
తాగిన మైకంలో స్నేహితులతో కలిసి ఓ భర్త భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన హర్కేష్ కుమార్-కవిత కుమారికి గత ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. హర్కేష్‌కు తాగుడు అలవాటు వుంది. ఈ అలవాటుతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
ఎంత చెప్పినా భర్త తాగుడును వదిలిపెట్టకపోవడంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యపట్ల ద్వేషాన్ని పెంటుకున్న హర్కేష్ కుమార్ తాగిన మైకంలో తన స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్లి.. భార్యతో వాగ్వివాదానికి దిగాడు. 
 
ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. అయితే తాగుడును మానితేనే ఇంటికి వస్తానని కవిత తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన హర్కేష్ తుపాకీతో ఆమెను షూట్ చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న హర్కేష్‌తో పాటు అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments