ప్రేమించలేదని హత్య... 14 కత్తిపోట్లు.. పొట్టంతా ఛిద్రమైపోయింది..

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (15:23 IST)
ఓ యువతి ప్రేమించలేదని ఓ ఉన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుచ్చిలోని అతికుళంకు చెందిన కేశవన్ అనే 22 ఏళ్ళ యువకుడు, ఇంటర్ చదివే యువతిని ప్రేమించాడు. 
 
గత రెండెళ్లుగా ప్రేమించమని వెంటపడుతున్నాడు.  కానీ ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. అతని వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కేశవన్ ను అరెస్టు చేశారు. అయితే, నిందితుడు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. మరల యువతి కోసం వెతికాడు.
 
యువతి కాలేజ్ నుంచి బయటకు వస్తుండగా తన ప్రేమను రిజెక్ట్ చేసినందుకు ఆమెతో వాగ్వాదానికి వెళ్లాడు. అందరు చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. 
 
యువతి రక్తపు మడుగులోన రోడ్డుమీద కుప్పకూలిపడిపోయింది. ఆ తర్వాత స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాలికను చూసిన వైద్యులు దాదాపు.. 14 కత్తిపోట్లకు గురైందని తెలిపారు. ఆమె పొట్టంతా కత్తిగాట్లతో ఛిద్రమైపోయింది. ప్రస్తుతం బాలిక చనిపోయింది. ఆ తర్వాత నిందితుడు కేశవన్ అక్కడే రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments