Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపార్ట్‌మెంట్ కల్చర్.. పడకగది కింద బావి.. భార్యాభర్తలు పడిపోయారు....

అపార్ట్‌మెంట్ కల్చర్ ప్రస్తుతం బాగా పెరిగిపోతోంది. భవన నిర్మాణాల్లో నాణ్యత కొరవడిన విషయం తెలియక చాలామంది అపార్ట్‌మెంట్లను కొని.. వాటిలో జీవనం గడిపేస్తున్నారు. నాణ్యత లేని నిర్మాణం, వాటిని ఏ ప్రాంతంలో

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (15:01 IST)
అపార్ట్‌మెంట్ కల్చర్ ప్రస్తుతం బాగా పెరిగిపోతోంది. భవన నిర్మాణాల్లో నాణ్యత కొరవడిన విషయం తెలియక చాలామంది అపార్ట్‌మెంట్లను కొని.. వాటిలో జీవనం గడిపేస్తున్నారు. నాణ్యత లేని నిర్మాణం, వాటిని ఏ ప్రాంతంలో ఎలా కట్టారనే విషయాన్ని పక్కనబెట్టి బాగా డబ్బులు వెచ్చించి కొనేస్తున్నారు. దీంతో లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
సాధారణంగా నిద్రించే పడకగది కింది భాగంలో బావి వుంటే మీరేం చేస్తారు.. ఆ బావిలో పడిపోతే వామ్మో అనుకోరు. అలాంటి ఘటనే చెన్నైలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. చెన్నై అంబత్తూర్‌లోని ఎస్ఎస్‌వీకె అపార్ట్‌మెంట్ గ్రౌండ్‌ఫ్లోర్ ఫ్లాట్‌లో నివసించే ఎల్ఐసి ఏజెంట్ చంద్రశేఖర్ (69) రోజూ నిద్రించే పడకగది కింద లోతైన నేలబావి ఒకటి వున్నది.
 
ఈ విషయాన్ని అతడు ఊహించలేదు. దీంతో బెడ్ మీద నిద్రిస్తున్న వ్యక్తితో పాటు ఆయన భార్య కూడా బావిలో పడిపోయారు. భర్త పడిపోగానే అతడిని కాపాడే క్రమంలో భార్య కూడా ఆ బావిలో పడిపోయింది. దీన్ని గమనించిన అపార్ట్ మెంట్‌లోని వారు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. వారు బాధితులను బావి నుంచి బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments