Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ బిల్లు కట్టమన్నారనీ రూమ్మేట్స్‌ను చంపేసిన యువకుడు...

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (09:30 IST)
ఢిల్లీలో ఉపాధి చేసుకుంటూ జీవిస్తూ వచ్చిన ఓ యువకుడు కరోనా లాక్డౌన్ కారణంగా సొంతూరికి వెళ్లిపోయాడు. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఢిల్లీలోని తన రూమ్మేట్స్ గదికి వచ్చాడు. అతను వచ్చీరాగానే, మిగిలిన ఇద్దరు స్నేహితులు కరెంట్ బిల్లు, అద్దె కట్టమని ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహించిన ఆ యువకుడు... ఇద్దరు రూమ్మేట్స్‌ను పొడిచి చంపేసి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈ ఘటన వెస్ట్ న్యూఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహ్ గ్రామానికి చెందిన సాకీర్ (23) అనే వ్యక్తి వెస్ట్ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో మరో ఇద్దరు వలస కూలీలైన అజాం(45), అమీర్ హాసన్ (46)తో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ గదికి నెలకు రూ.4 వేలు అద్దె చెల్లిస్తూ వచ్చారు. 
 
అయితే, లాక్డౌన్‌ కారణంగా సాకీర్ తన స్వగ్రామానికి వెళ్లి, నాలుగు నెలల తర్వాత మంగళవారం రూమ్‌లో దిగాడు. దీంతో మిగిలిన ఇద్దరు రూమ్మేట్స్ ఆగ్రహించారు. అతను లేని నాలుగు నెలల అద్దె కూడా కట్టాలని పట్టుబట్టారు. దీంతో కొపం తెచ్చుకున్న నిందితుడు మిత్రులిద్దర్నీ పొడిచి చంపేసి, స్వగ్రామానికి వెళ్లిపోయాడు. 
 
దీనిపై ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత నిందితుడిని అరెస్టుచేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సాకీర్ సొంత గ్రామానికెళ్లి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments