Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం మంచిది కాదన్న పాపానికి..?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (22:37 IST)
వివాహేతర సంబంధం మంచిది కాదు అని చెప్పినందుకు ఓ వ్యక్తి పై అతని స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సంతోష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రియాసత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ఇసా, షాహీనగర్‌ ప్రాంతానికి చెందిన అక్బర్‌ ఖాన్‌ లిద్దరూ స్నేహితులు. అయితే అక్బర్‌ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
 
ఇదిలా ఉండగా ఈ నెల 24న రాత్రి రియాసత్‌నగర్‌లోని డికాషన్‌ హోటల్‌ వద్ద ఇసాను స్నేహితుడు అక్బర్‌ ఖాన్‌ కలిశాడు. వివాహేతరం సంబంధం మంచిది కాదని మహ్మద్‌ ఇసా తన స్నేహితుడికి సూచించాడు. 
 
దాంతో కోపోద్రిక్తుడైన అక్బర్‌ ఖాన్‌ కత్తితో ఇసా ముఖంపై దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న ఇసాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఇసా ముఖంపై ఎనిమిది కుట్లు పడ్డాయి. పోలీసులు కేసు నమదు చేసుకుని అక్బర్‌ ఖాన్‌ను బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments