కేరళలో మూడోవేవ్‌కి సంకేతమా.. 24 గంటల్లో 30వేల కేసులు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (22:13 IST)
కేరళలో తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు.. మూడోవేవ్‌కి సంకేతమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 30 వేలకు పైగా నమోదై.. 30 శాతం మేర కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
దీంతో కేరళలో నమోదైన కేసులు మూడో వేవ్‌కి వార్నింగ్‌ బెల్స్‌ మోగించాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్‌ చివరి నాటికి థర్డ్‌వేవ్‌ ఉధృతం కావచ్చని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. 
 
మరోవైపు కోవిడ్‌ అంచనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ బుధవారం భారత్‌లో మునుపటి కంటే కరోనా వ్యాప్తి రేటు తక్కువగా ఉందని చెప్పారు. 
 
భారత్‌లో కోవిడ్‌ ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి (ఎండెమిక్‌) దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందని ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఉపశమనం కలిగించేలా ఉన్నా.. నిపుణులు మాత్రం గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి అని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments