Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుకను స్నాక్స్‌లా తినేస్తున్న వ్యక్తి.. 40 ఏళ్లుగా ఇదే తంతు!

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (17:30 IST)
sand
ఈ మనిషి గురించి వింటే షాకవుతారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 40 సంవత్సరాలుగా ఇసుక తింటున్నాడు ఒక వ్యక్తి. ఇసుకను స్నాక్స్‌లాగా ఆరగించేస్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన హరిలాల్ సక్సేనా గంజాం జిల్లా కీర్తిపూర్ లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి 40 ఏళ్లుగా ఇసుక తినే అలవాటుంది. 
 
భోజనానికి ముందో లేదంటే భోజనం తరువాతో ఇసుకను తినేవాడు. అయితే, ఒకప్పుడు చాలా ఎక్కువగా తినేవాడినని, ఇప్పుడు తగ్గించేశానని హరిలాల్ చెబుతున్నాడు. 
 
ఇసుక తిన్న తర్వాత కాస్తంత అసౌకర్యంగా అనిపించినా.. ఆ తర్వాత అంతా మామూలుగా అవుతుందని వివరించాడు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని చెప్పుకొచ్చాడు. 
 
తన చిన్నప్పుడు తాముండే గ్రామానికి దగ్గర్లోనే ఓ నది ఉండేదని, రోజూ అక్కడకు వెళ్లి ఇసుకను తినేవాడినని తెలిపాడు. వర్షాకాలం వస్తే ముందుగానే ఇసుకను ఇంట్లో భారీగా నిల్వ పెట్టుకునే వాడినని వివరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments