రేప్ చేసి ఆమెను తగలబెట్టాడు.. అతడిని కూడా మంటల్లోకి లాగేసింది.

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (12:36 IST)
మానభంగం చేసి తన పరువు తీయడమే కాకుండా తన ప్రాణాలను తీయబోతున్నాడని గ్రహించిన బాధితురాలు అతడిని కూడా మంటల్లోకి లాగింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సంఘటన చోటుచేసుకుంది. మాల్దాలో నివాసం ఉంటున్న ఓ వితంతువు మీద 35 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూమార్తెకు పెళ్లయింది. ఆమెను తన కోరిక తీర్చాలంటూ ఆ వ్యక్తి వేధించేవాడు. 
 
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసాడు. అయితే జరిగిన విషయాన్ని ఆమె బయటకు చెప్తుందనే కారణంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకుని ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అయితే, బాధితురాలు అతడిని బయటకు వెళ్లనీయకుండా గట్టిగా పట్టుకుని మంటల్లోకి లాగేసింది. 
 
ఆపై అతడిని గట్టిగా కౌగిలించుకుని వెళ్లకుండా అడ్డుకుంది. సదరు నిందితుడికి బాగా గాయాలయ్యాయి. వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో పొరుగు వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు. నిందితుడు మాత్రం చికిత్స పొందుతూ చనిపోగా, బాధితురాలి ముఖం మీద కాలిన గాయాలయ్యాయి. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు గత కొన్ని రోజులుగా ఆ ఇంటికి వస్తుండేవాడు అని స్థానికులు చెప్పారు. నిందితుడు మాల్దాకి 35 కిలోమీటర్ల దూరంలో చంచల్ అనే గ్రామానికి చెందిన వాడు. అయితే అతడు అంత దూరం నుండి ఎందుకు వచ్చాడనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments