Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను కాటేసిన పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చిన భర్త.. ఆయన చెప్పింది విని వైద్యుల షాక్

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (10:38 IST)
తన భార్యను ఓ పాము కాటేసింది. దీంతో కాటేసిన పామును పట్టుకుని సంచిలో వేసుకుని భార్యను తీసుకుని భర్త ఆస్పత్రికి వచ్చాడు. తన భార్యను పాము కరిచిందని, అందుకే ఆ పామును కూడా పట్టుకుని ఆస్పత్రికి వచ్చినట్టు వైద్యులకు చెప్పాడు. పైగా ఏ పాము కరిచిందే తెలిస్తే అందుకు తగిన విధంగా వైద్యం చేయొచ్చని పామును పట్టుకుని తెచ్చినట్టు వైద్యులకు చెప్పాడు. ఈ మాటలు విన్న  వైద్యులు షాక్‌కు గురయ్యారు. పామును చూసిన వైద్య సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని ఉమన్ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర - కుష్మా అనే దంపతులు ఉన్నారు. కుష్మా తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తుండగా, ఆమెను పాము కాటేసింది. దీంతో ఆమె గట్టిగా అరుస్తూ కుప్పకూలి స్పృహ కోల్పోయింది. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆస్పత్రికి వెళ్లకుండా నేరుగా ఇంటికి వచ్చి ఇంటి పరిసరాల్లోదాగివున్న పామును వెతికి పట్టుకున్నాడు. ఆపై దానిని సంచిలో వేసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. సంచిలోని పామును చూసిన వైద్యులు భయభ్రాంతులకు గురయ్యారు. పామును ఆస్పత్రికి ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నిస్తే, ఆయన ఇచ్చిన సమాధానం విన్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది విస్తుపోయారు.
 
ఏ పాము కాటేసిందో తెలిస్తే అందుకు తగ్గట్టుగా వైద్యం చేసే వీలుంటందన్న ఉద్దేశ్యంతో దానిని తెచ్చినట్టు చెప్పడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం కుష్మా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమెకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో ఆ వ్యక్తి పామును తీసుకెళ్లి అడవిలో వదిలివేశాడు.

సంబంధిత వార్తలు

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments