Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడు మామూలోడు కాదు... వైరలవుతున్న దూరదర్శన్ ట్యూన్‌కు బ్రేక్‌డ్యాన్స్

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (14:03 IST)
డిష్ టీవీలు, స్మార్ట్ ఫోన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో లేనిసమయంలో దృశ్యవార్తల కోసం కేవలం దూరదర్శన్‌పైనే ఆధారపడేవాళ్ళం. దూరదర్శన్‌లో వార్తలు వచ్చే ముందుగా వచ్చే మ్యూజిక్ ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అయితే, కాదేదీ కవితకనర్హం అన్న చందంగా ఈ ట్యూన్‌కు వెరైటీగా బ్రేక్‌ డ్యాన్స్‌ చేశాడో యువకుడు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరలవుతోంది. వైశాఖ్‌ నాయర్‌ అనే యువకుడు వినూత్నంగా ఆలోచన చేసి దూరదర్శన్‌ వార్తలు వచ్చేటప్పుడు వినిపించే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌కు బ్రేక్‌ డ్యాన్స్‌ వేశాడు. దాన్ని కాస్తా టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయడంతో అది ఇప్పడు తెగ వైరలైంది. 
 
ఇప్పటికే ఈ వీడియోను లక్షమందికి పైగా చూశారు. 'ప్రతి ట్రాక్‌కు వైశాఖ్ భలే చేశాడే' అని కొందరు మెచ్చుకుంటే, 'వీడికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదు' అంటూ ఇంకొందరు.. 'జనరేటర్‌ మోతకు కూడా వీడు డ్యాన్స్‌ చేయగలడు' అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు జనాలు.
 
నిజానికి ఇటీవలికాలంలో తమలో ఏదో ఒక ప్రతిభదాగివున్న ప్రతి ఒక్కరూ రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్నారు. ఆకోవలో ఒక్క కన్నుగీటుతో ప్రియా ప్రకాష్ వారియర్, సింగర్‌ బేబీ వంటివారందరికీ ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ వచ్చింది. దీనికంతటికీ కారణం సోషల్ మీడియా. అలాంటివాటిలో ఒకటి టిక్‌టాక్ యాప్ ఒకటి. 
 
దీనిద్వారా నెటిజన్లు తమలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అయితే దీనివల్ల లాభల కంటే కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయనే వాదన లేకపోలేదు. అందుకే ఇటీవల ఈ యాప్‌ను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది కూడా. మొత్తమీద వైశాఖ్‌ నాయర్‌ చేసిన డ్యాన్స్ మాత్రం ఇపుడు వైరలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments