Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవత ప్రసన్నం కోసం.. భార్యను ముక్కలుగా నరికిన భర్త.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (13:36 IST)
ఆ వ్యక్తికి మూఢనమ్మకాలు ఎక్కువ. ఆ మూఢ నమ్మకమే భార్యను ముక్కలుగా నరికేలా చేసింది. దేవత ప్రసన్నం కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగ్రౌలీ జిల్లాలోని బ‌సౌడా గ్రామానికి చెందిన ఓ 50 యేళ్ల వ్యక్తికి మూఢ‌న‌మ్మ‌కాలు ఎక్కువ‌. త‌ర‌చూ త‌న ఇంట్లో దేవ‌త‌కు జంతువుల‌ను బలిస్తూ ఏవేవో పూజ‌లు చేస్తుండేవాడు. పైగా, తన ఇష్ట దేవ‌త‌ను మ‌రింత ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ఆ వ్య‌క్తి త‌న భార్య‌ను బ‌లివ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. 
 
ఈ క్ర‌మంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున నిద్రిస్తున్న త‌న 45 యేళ్ళ భార్య‌ను పొడ‌వాటి క‌త్తితో అత్యంత కిరాత‌కంగా న‌రికి త‌ల‌, మొండెం వేరు చేసి పూజగ‌దిలో పెట్టి కాసేపు పూజ‌లు చేశాడు. ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని పూజ‌గ‌దిలోనే ఖ‌న‌నం చేసి పారిపోయాడు.
 
దీన్ని గ‌మ‌నించిన అత‌డి ఇద్ద‌రు కుమారులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ముక్కులు ముక్కలుగా పాతిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. 
 
ఈ కేసులో కీల‌క విష‌యాలు రాబ‌ట్ట‌డం కోసం నిందితుడిని విచారిస్తున్నామ‌ని, ఇద్ద‌రు కుమారుల వాంగ్మూలం సేక‌రించిన త‌రువాత నిందితుడు తన భార్యను మూఢ‌న‌మ్మ‌కాల‌తోనే హ‌త్య చేసిన‌ట్లు ఎస్పీ ప్ర‌దీప్ షిండే తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments