ఫిర్యాదు చేశాడనీ సహోద్యోగి తల తెగనరికి కిరాతక ఉద్యోగి.. ఆ రాత్రంతా...

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (08:57 IST)
తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడన్న కక్షతో ఓ కిరాతక ఉద్యోగి తన కంటే సీనియర్ అయిన సహోద్యోగి తల తెగనరికాడు. ఆ తర్వాత ఆ మృతదేహం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. తన పార్టీ ఇస్తానని ఇంటికి పిలిపించి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన సందీప్ మిశ్రా అనే వ్యక్తి ఓ కంపెనీలో మెషీన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇదే కంపెనీలో ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి సీనియర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. 
 
అయితే, సందీప్ పనితీరుపై ప్రమోద్ కుమార్ కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీన్ని సందీప్ జీర్ణించుకోక ప్రదీప్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్‌ను భౌతికంగా లేకుండా చేయాలని ప్లాన్ చేసిన సందీప్.. మందు పార్టీ పేరుతో తన ఇంటికి పిలిపించాడు. 
 
అక్కడ పీకల వరకు మద్యం సేవించిన తర్వాత ప్రదీప్ కుమార్ మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత కత్తితో తలను తెగనరికాడు. ఆ తర్వాత ఆయన అక్కడే నిద్రపోయాడు. ఉదయం లేచి తలను ప్లాస్టిక్ సంచిలో చుట్టి బయటకు తీసుకొచ్చి చెత్త కుప్పలో విసిరేశాడు. 
 
ప్రదీప్ కుమార్ ఇల్లు సందీప్ ఇల్లు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. తన భర్త రాత్రికి ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు ఉదయం సందీప్ ఇంటికి ప్రదీప్ భార్య వెళ్లి చూడగా, రక్తపు మడుగులో తన భర్త పడివుండాన్ని చూసి బోరున విలపించసాగింది. 
 
ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చిన తలలేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోని చెత్త కుండీల్లో గాలించగా, ప్రదీప్ కుమార్ తల లభ్యమైంది. అలాగే, హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments