Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలో దారుణం : ట్రక్కుకు కాళ్లను కట్టేసి ఈడ్చుకెళ్లారు...

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (17:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ఆదివాసి తప్పు లేకపోయినప్పటికీ.. అతన్ని కాళ్ళను తాడుతో ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమూచ్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన కన్హయ్య లాల్ భీల్ (45) అనే ఆగివాసీ తెగకు చెందిన వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అదేసమయంలో చిత్తర్మల్ గుర్జర్ అనే పాల వ్యాపారి బైకుపై వచ్చి లాల్ భీల్‌‌ను ఢీకొట్టాడు. దీంతో బైకుతో పాటు.. ఇద్దరూ కిందపడిపోయారు. 
 
బైకులో ఉన్న పాల క్యాను కూడా కిందపడిపోవడంతో అందులోని పాలు కూడా మొత్తం ఒలిగిపోయాయి. దీంతో కన్హయ్యపై చిత్తర్మల్ దాడికి దిగాడు. తన స్నేహితులను పిలిపించి కొట్టించాడు. ఆ తర్వాత బాధితుడి కాలిని తాడుతో ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. ఒక నిందితుడు అతడి మొహంపై తన్నాడు. బాధతో విలవిల్లాడుతూ అతడు వేడుకున్నా వినలేదు. ఒళ్లంతా రోడ్డుకి రాసుకుపోయి కన్హయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
 
పాల వ్యాపారి దుశ్చర్యను చూసిన కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అలాగే, పోలీసులకు కూడా సమాచారం చేరవేశారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకునేలోపు నిందితులు పారిపోయారు.
 
అయితే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడుని ఆస్పత్రికి తరిలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కనుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నిందితులందరిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments