Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్‌పై తగ్గేదే లేదు: సుప్రీంను ఆశ్రయించిన మమత

ఆధార్ అనుసంధానంపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆమె ఇప్పటివరకు కేంద్రంతో పోరాటం చేస్తున్నారు. ఇపుడు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు.

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (07:28 IST)
ఆధార్ అనుసంధానంపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆమె ఇప్పటివరకు కేంద్రంతో పోరాటం చేస్తున్నారు. ఇపుడు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు.
 
మొబైల్‌, సిమ్‌ కార్డుల కనెక్షన్లకు ఆధార్‌ కార్డు లింకును తప్పని సరిచేస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు ఆమె తరపు న్యాయవాదులు శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై సోమవారం కోర్టు విచారించనుంది. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. కేంద్రం ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించిన దరిమిలా ఈ దావాకు ఎనలేని ప్రాధాన్యం లభించింది.
 
కాగా, ఇటీవల మమతా బెనర్జీ మాట్లాడుతూ... ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆధార్‌ కార్డు వివరాలను టెలికాం కంపెనీలకు ఇవ్వబోన్న ఆమె ప్రకటించిన విషయం తెల్సిందే. ‘అవసరమనుకుంటే నా మొబైల్‌ కనెక్షన్‌ రద్దు చేయండి’ అని గత వారం కేంద్రానికి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా కేంద్రం ‘ఆధార్‌ లింకు’ ఆదేశాలు జారీ చేసిందని ఆమె మొదటి నుంచీ వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments