Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధార్ - సిమ్ లింక్‌ ప్రక్రియ మరింత సులభతరం...

ఆధార్ - సిమ్ లింకు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా, ఇంటి వద్దకు వెళ్లి ఆధార్ ధృవీకరణ తీసుకోవాలని సూచన చేసింది. ఇందుకోసం నిబంధనల్లో మ

ఆధార్ - సిమ్ లింక్‌ ప్రక్రియ మరింత సులభతరం...
, గురువారం, 26 అక్టోబరు 2017 (10:56 IST)
ఆధార్ - సిమ్ లింకు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా, ఇంటి వద్దకు వెళ్లి ఆధార్ ధృవీకరణ తీసుకోవాలని సూచన చేసింది. ఇందుకోసం నిబంధనల్లో మార్పులు చేసింది. 
 
వినియోగదారుల ఇంటి దగ్గరకు వెళ్లి ఆధార్ ధ్రువీకరణ తీసుకోవడం, వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత వెరిఫికేషన్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. టెలికాం కంపెనీల సిమ్ కార్డులు ఉపయోగిస్తున్న వినియోగదారుల్లో వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉండే అవకాశం ఉండటంతో వినియోగదారుల ఇంటి దగ్గరకే వెళ్లి అనుసంధానం ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం కంపెనీలకు సూచించింది. 
 
అలాగే, ప్రజల విజ్ఞప్తి మేరకు ఆన్‌లైన్ విధానాన్ని కూడా రూపొందించాలని ఆపరేటర్లకు స్పష్టంచేసింది. మొబైల్ యూజర్ల ఆధార్ వెరిఫికేషన్ కోసం ఆధార్ ఓటీపీ సేవలను ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ లేదా మొబైల్ యాప్ ద్వారా అందించేలా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరింది. 
 
ఆధార్ డేటాబేస్‌లో ఒక మొబైల్ నంబర్ నమోదై ఉంటే.. ఓటీపీ పద్ధతి ద్వారా అదే మొబైల్ నంబర్‌తోపాటు వినియోగదారునికి ఉన్న ఇతర నంబర్లను కూడా ధ్రువీకరించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటివరకు ఆధార్ డేటాబేస్‌లో 50 కోట్ల మొబైల్ నంబర్లు నమోదైవున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు: ముగ్గురు మావోయిస్టుల హతం