Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌క్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ మునిమ‌నవరాలికి జైలు శిక్ష

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (13:10 IST)
ఓ ఫోర్జరీ కేసులో దోషిగా తేలిన మ‌హాత్మాగాంధీ మునిమ‌నవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్(56)కు ద‌క్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆశిష్ లతా రామ్‌గోబిన్... వ్యాపారవేత్త  ఎస్‌ఆర్ మ‌హ‌రాజ్‌ను మోసం చేసినట్లు తేలింది.

భార‌త్‌ నుంచి ఆమెకు  వచ్చే ఒక‌ కన్‌సైన్‌మెంట్‌కు కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్ ఆమెకు అడ్వాన్స్ రూపంలో రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చారు. అయితే ఆ కన్‌సైన్‌మెంట్ నుంచి వచ్చే లాభాల్లో కొంత మొత్తం ఆయనకు లభిస్తుంది.

అయితే అటువంటి కన్‌సైన్‌మెంట్ ఏదీ లేదంటూ కొన్ని నకిలీ బిల్లులు సృష్టించి, మ‌హ‌రాజ్‌ను ఆమె  మోసం చేశారని విచార‌ణ‌లో తేలింది. ఈకేసు విచార‌ణ 2015లోనే ప్రారంభ‌మ‌య్యింది. ఆమె ఈ ఉదంతంలో... లేని కన్‌సైన్‌మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు త‌యారు చేశార‌ని తేలింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన‌ ఆమె... 50 వేల‌ ర్యాండ్లు పూచీకత్తుగా చెల్లించి, బెయిల్‌పై విడుదలయ్యారు. 2015 ఆగస్టులో ఆశిష్ లతా... మహరాజ్‌ను కలిశారు. తాను సౌత్ ఆఫ్రికన్ హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం మూడు కంటైనర్ల లైనెన్‌ను భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆమె మ‌హ‌రాజ్‌కు తెలిపారు.

అయితే ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించేందుకు డ‌బ్బులు లేవ‌ని చెప్పి ఆమె మహరాజ్ నుంచి ఆర్ధిక సాయం పొందారు. ఆమె చూపించిన నకిలీ ఇన్వాయిస్ ఆధారంగా ఆమెకు మ‌హ‌రాజ్ డ‌బ్బులు ఇచ్చినట్లు తేలింది.

కాగా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ ఎంతో మంది పేదలకు న్యాయ స‌హాయం చేశారు. అయితే ఇప్పుడు గాంధీ పేరును ఆమె దిగ‌జార్చేలా ప్ర‌వ‌ర్తించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments