ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి జైలుకు వెళతారని టీడీపీ నేత అట్టాభిరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
దీనిపై స్పందించిన పట్టాభిరామ్ మాట్లాడుతూ జగన్ బెయిల్ రద్దు విషయంలో సీబీఐ న్యాయస్థానం నిర్ణయానికే వదిలేసిందని, పిటిషన్ మెరిట్స్ ఆధారంగా గౌరవ కోర్టు నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోరిందన్నారు.
జగన్మోహన్ రెడ్డి కుంటి సాకులు చెబుతూ గత 7,8 ఏళ్లుగా విచారణకు సహకరించకుండా, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని పట్టాభిరామ్ విమర్శించారు. జగన్ బెయిల్‌పై బయట తిరుగుతూ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రూ. 43వేల కోట్లు స్కామ్‌కు సంబంధించి సీబీఐ ఆధారాలతో సహా పట్టుకుందని, ఇక జగన్ రెడ్డి తప్పించుకోలేరని అన్నారు. ఇవాళ సీబీఐ కౌంటర్‌తో అర్థమైందన్నారు. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఆయనకు ఇష్టమైన ప్రదేశానికి తిరిగి వెళతారని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.