Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాటిళ్లపై "తాగి వాహనాలు నడపవద్దు" హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (13:56 IST)
ఇప్పటివరకు మద్యం బాటిళ్లపై "మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం" అనే ట్యాగ్ మాత్రమే ఉంది. అయితే మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఈ ట్యాగ్‌ను మరింత పొడిగించాలని భావిస్తోంది మహారాష్ట్ర సర్కార్. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హెచ్చరిక జారీ చేసింది. 
 
మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖ జారీ చేసిన చట్టబద్ధమైన హెచ్చరికలో ఇక నుండి మద్యం బాటిళ్లపైన "మద్యం త్రాగడం ఆరోగ్యానికి హానికరం. మద్యం త్రాగకుండా సురక్షితంగా ఉండండి. మద్యం త్రాగి వాహనాలు నడపవద్దు" అని ముద్రించమని ఆదేశాలు జారీ చేసారు. మద్యం, బీరు బాటిళ్లపై ఈ హెచ్చరికను మరాఠీ భాషలో ముద్రించాలని మద్యం తయారీ సంస్థలను మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది. 
 
ఏప్రిల్ 1వ తేదీ నుండి బయటకు వచ్చే మద్యం బాటిళ్ల లేబుల్‌లపై తప్పనిసరిగా ఈ హెచ్చరిక ఉండాలని ఆదేశించింది. ఈ హెచ్చరికను బాగా కనిపించే విధంగా పెద్ద అక్షరాల్లో ముద్రించాలని కూడా పేర్కొనడం విశేషం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments