మహారాష్ట్రలో 3వేల కేసులు.. హాట్ స్పాట్‌గా మారిన ముంబై

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (12:57 IST)
మహారాష్ట్రలో మొత్తం మూడువేల కేసులు దాటాయి. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 3,320కి చేరింది. అటు ముంబైలోనూ కొత్త కేసులు వణుకుపుట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో మొత్తం కేసులు రెండు వేలు దాటాయి. దేశ ఆర్థిక రాజధానిలో సామాన్యులకే కాదు ఇప్పుడు నేవీ అధికారులకు కరోనా సోకుతోంది. 
 
కరోనా విజృంభించడంతో ముంబై హాట్‌స్పాట్‌గా మారింది. ఇప్పటికే అక్కడ దాదాపు రెండు వేల మంది పాజిటివ్‌గా తేలింది. ఇక ధారావిలో కరోనా కేసుల సంఖ్య వంద దాటింది. ధారావిలో కేసులు వేగంగా పెరుగుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ముంబైతో పాటు పుణె ఇతర ప్రాంతాలను కేంద్రం రెడ్‌జోన్‌గా గుర్తించింది. ఇక మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 200 దాటింది. కొత్త కేసులు మాత్రమే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో దాదాపు 32 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
 
దాదాపు 20 మంది నేవీ అధికారులకు పాజిటివ్ అని తేలడం షాక్‌కు గురిచేస్తోంది. దీంతో వారిని ముంబై నగరంలోని కొలాబాలోని ఇండియన్ నేవీకి చెందిన అశ్వినీని ఆస్పత్రిలో చేర్చించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నావికాదళం సిబ్బందికి కరోనా సోకిన ఘటనతో తాము యుద్ధ నౌకలు, జాలాంతర్గాముల్లో వైరస్ లేకుండా శానిటైజ్ చేయించామని భారత నావికాదళం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments