Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను ఇరికించాలని ఇరుక్కుంది... ప్రియుడు కోసం స్నేహితురాలిని హత్య చేసిన మహిళ

Webdunia
ఆదివారం, 9 జూన్ 2019 (12:27 IST)
భర్తను ఇరికించాలని భావంచిన ఓ వివాహిత చివరకు తాను చిక్కుల్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కిస్తోంది. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితోనే ఉండిపోవాలని భావించింది. ఇందుకోసం తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగా భర్తను నమ్మించేందుకు ఓ ప్లాన్ వేసింది. ప్రియుడు సాయంతో తన స్నేహితురాలిని హత్య చేసింది. ఆ శవం పక్కన... తన భర్త వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ యువతి ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టి, ప్రియుడుతో లేచిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అది హత్యగా ప్రాథమిక నిర్ధారించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కంత్రీ వివాహితను అరెస్టు చేశారు. 
 
ఈ దారుణం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఔరంగాబాద్‌కు చెందిన సోనాలీ షిండే (30) అనే వివాహితకు అదే ప్రాంతానికి చెందిన చబ్బాదాస్ వైష్ణవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తను వీడి ప్రియుడుతోనే ఉండిపోవాలని భావించింది. ఇందుకోసం ఓ పథకం వేసింది. 
 
ప్రియుడు వైష్ణవ్‌తో కలిసి తన స్నేహితురాలు రుక్మన్ బాయీ మాలీని హత్య చేసింది. ఆపై మృతదేహంపై ఉన్న దుస్తులను తీసేసి, తన దుస్తులు, చెప్పులు తొడిగింది. తన ఆభరణాలను ధరింపచేసింది. తన మృతికి భర్తే కారణమని, నిత్యమూ మద్యం తాగొచ్చి కొడుతుంటాడని రాసి, మృతదేహం పక్కనే సూసైడ్ నోట్ పడేసి వెళ్లింది. 
 
అయితే, ఆ స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... మృతదేహాన్ని చూసిన తర్వాత హత్యగా అనుమానించి విచారించగా, సోనాలీ కుట్ర బయటకు వచ్చింది. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments