Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు తండ్రి కేబినెట్‌లో నేడు కొడుకు మంత్రివర్గంలో...

Webdunia
ఆదివారం, 9 జూన్ 2019 (12:09 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా తనదైనశైలిలో ఆయన తన మంత్రివర్గం కూర్పు చేసుకున్నారు. మొత్తం 25 మంది మంత్రుల్లో ఆరుగురు మంత్రులు అందరికంటే అదృష్టవంతులని చెప్పాలి. 
 
ఆ ఆరుగురు మంత్రులు ఎవరో కాదు.. సీనియర్ నేతలైన పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశ్వరూప్, బాలినేని శ్రీనివాస రెడ్డిలు జగన్ తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో కూడా పని చేశారు. వీరంతా ఇపుడ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. పైగా, వీరికి అత్యంత కీలక శాఖలను ముఖ్యమంత్రి జగన్ కేటాయించడం గమనార్హం. 
 
వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించగా, బొత్సకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను, మోపిదేవి వెంకటరమణకు మత్స్య, పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్ శాఖలను కేటాయించారు. 
 
అలాగే, పినిసె విశ్వరూప్‌కు సాంఘిక సంక్షేమ శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖలు, బాలినేని శ్రీనివాసరెడ్డికి విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments