Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ : మహారాష్ట్ర, బెంగాల్‌లో అన్ని రకాల ఎన్నికలు వాయిదా

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (08:53 IST)
వెస్ట్ బెంగాల్‌తో పాటు మహారాష్ట్రలో 3 నెలల పాటు అన్ని రకాల ఎన్నికలు వాయిదావేశారు. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో పురపాలిక ఎన్నికలు కూడా వాయిదా వేశారు. మహారాష్ట్రలోని పూణెలో 144 సెక్షన్ అమల్లో ఉంది. 
 
ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలు, పలు సాఫ్ట్ వేర్ సంస్థలు, సినిమా థియేటర్స్ ఇప్పటికే మూసివేశారు. 
 
బాలీవుడ్, టాలీవుడ్ లలో షూటింగ్స్ కూడా రద్దు చేశారు. ‘కరోనా’ కారణంగా ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదాపడ్డాయి. తాజాగా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు కూడా ఇదే బాటపట్టాయి. మహారాష్ట్రలో మూడు నెలల పాటు అన్ని రకాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. పశ్ఛిమబెంగాల్ లో పురపాలిక ఎన్నికలు వాయిదా పడ్డట్టు సమాచారం. ‘కరోనా’ కారణంగా మహారాష్ట్రలోని పుణెలో 144 సెక్షన్ అమలులో ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments