Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలు, సెల్‌ఫోన్లు బంద్: రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య..?

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (13:08 IST)
Digital Detox
మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని ఓ గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాడేగావ్ మండలంలోని మోహిత్యాంచె వడ్గావ్ గ్రామ జనాభా 3,105. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు పిల్లలకు తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చారు. 
 
అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఎప్పుడు చూసినా పిల్లలు మొబైల్ ‌ఫోన్‌తోనే కనిపించడంతో తల్లిదండ్రులలో ఆందోళన మొదలైంది. మరోవైపు, మహిళలేమో పిల్లల గురించి పట్టించుకోకుండా టీవీ సీరియళ్లు చూడడంలో మునిగిపోయేవారు. 
 
ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని, పిల్లల భవిష్యత్ నాశనమవుతుందని గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే భావించారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. 
 
అందులో భాగంగా ఆగస్టు 15న గ్రామంలోని మహిళలు అందరితో సమావేశమయ్యారు. రోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య టీవీలు, సెల్‌ఫోన్లు ఆఫ్ చేయాలని తీర్మానించారు.  
 
అప్పటి నుంచి రోజూ రాత్రి ఏడు గంటలు కాగానే సైరన్ మోగుతుంది. అంతే సెల్ఫ్‌ఫోన్లు ఆఫ్ అయిపోతాయి. టీవీలు మూగబోతాయి. పిల్లలు శ్రద్ధగా హోం వర్కులు చేసుకుంటారు. మహిళలు ఇంటి పనులు చూసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొనియాడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments