దేశంలో చాలా ప్రాంతాలకు రోడ్డు మార్గం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది.
అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.