Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లంక గ్రామాల్లో ఆకలి కేకలు - హృదయ విదారక దృశ్యాలు

Advertiesment
flood victims
, మంగళవారం, 19 జులై 2022 (14:01 IST)
గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం వల్ల ఏర్పడిన వరద వల్ల కోనసీమ లంక గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత ఆరు రోజులుగా అన్నపానీయాల కోసం వారు తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు కోనసీమ లంక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. 
 
కోనసీమ లంక గ్రామాల ముంపు బాధితులు గత ఆరు రోజులుగా ఆహార ప్యాకెట్ల కోసం ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. వరదల కారణంగా మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు తిండిలేక అవస్థలు పడుతున్నారు. 
 
కొంతమంది గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులకు ఆహార ప్యాకెట్లు కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకునే పరిస్థితి  ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. 
 
వరద తాకిడికి గురైన ప్రాంతాల బాధితులు గత కొద్ది రోజులుగా ఆహారం, నీరు కోసం అల్లాడుతున్నారు. తమకు ఆహారం, నీరు అందించడం లేదని, సరైన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ స్మార్ట్ మార్కెట్‌లోకి టెక్నో స్పార్క్ 9 ఫోన్