Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 11 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు?

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (11:03 IST)
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కష్టాల్లో పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల్లో 11 మంది తిరుగుబాటు జెండా ఎగురవేసినట్టు వార్తలు వస్తున్నారు. పైగా, వీరంతా బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో మకాం వేసినట్టు వినికిడి.
 
ఇటీవల జరిగిన మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీన్ని నుంచి కోలుకోక ముందే ఇపుడు మరో షాక్ తగిలింది. రాష్ట్ర కేబినెట్‌ మంత్రి, శివసేన సీనియర్‌ నేత ఏకనాథ్‌ షిండే తన అనుచర ఎమ్మె్ల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
సోమవారం సాయంత్రం నుంచి షిండే, మరో 11 మంది ఎమ్మెల్యేలు ఠాక్రే సర్కారుకు అందుబాటులో లేకుండా పోయారు. ప్రస్తుతం వీరంతా గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గా సమాచారం. సోమవారం రాత్రి వీరంతా ఛార్టెడ్‌ విమానంలో వెళ్లినట్లు తెలుస్తోంది. 
 
మంగళవారం మధ్యాహ్నం షిండే మీడియా సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం. షిండే భాజపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా షిండే.. సంకీర్ణ ప్రభుత్వం తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిణామాలతో అఘాడీ సర్కారు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కన్పిస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments