Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూలేలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:13 IST)
మహారాష్ట్రలోని ధూలేలో బుధ‌వారం రాత్రి ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన ఏడెనిమిది వాహ‌నాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు మృతి చెంద‌గా, ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 
 
స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని షాంపూర్‌ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments