Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులు నడిపే మాంసపు షాపులకు ప్రత్యేకంగా సర్టిఫికేషన్... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (17:03 IST)
మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందువులు నిర్వహించే మాంసపు దుకాణాలకు మల్హర్ పేరుతో ఓ సర్టిఫికేషన్‌ను మంజూరు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా తీసుకొచ్చింది. అయితే, ఈ సర్టిఫికేషన్ కేవలం హిందువులు నడిపే మటన్ షాపులకు మాత్రమేనని ఆ రాష్ట్ర ఫిషరీస్ మంత్రి నితీశ్ రాణే వెల్లడించారు. 
 
జట్కా మాంసం సరఫరాదారుల కోసం ప్రత్యేకంగా మల్హర్ సర్టిఫికేషన్ డాట్ కామ్ అనే వేదికను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీనిని ప్రత్యేకంగా హిందువులు నిర్వహిస్తారని, మాంసంలో ఎక్కడా కల్తీ ఉండదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మల్హర్ సర్టిఫికేషన్ లేని దుకాణాల్లో హిందువులు మాంసం కొనవద్దని ఆయన సూచించారు. 
 
దేశంలో ప్రస్తుతం ఉన్న హలాల్ సర్టిఫికేషన్ వంటిదే మల్హర్ సర్టిఫికేషన్ అని చెప్పారు. హలాల్‌లో షరియా, ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా మాంసాన్ని సిద్ధం చేస్తారని తెలిపారు. ఒక జంతువును తినేందుకు ముందు దానిని ఒక నిర్ధిష్ట పద్ధతిలో బలి ఇవ్వాలని ఇస్లాం చెబుతుంది. అయితే, హలాల్‌కు భిన్నంగా జట్కాలో ఒకే దెబ్బతో నొప్పి లేకుండా జంతువును బలి ఇస్తారని పేర్కొన్నారు. 
 
మల్హర్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ప్రకారం జట్కా మటన్, చికెన్ వ్యాపారులకు మల్హర్ సర్టిఫికేట్‌ను ఇస్తారు. ఇందులో హిందూ సంప్రదాయం ప్రకారం మేక లేదా గొర్రెను బలి ఇస్తారని తెలిపారు. ఆ తర్వాత మాంసాన్ని సిద్ధం చేస్తారని పేర్కొన్నారు. ఈ మాంసం ప్రత్యేకంగా హిందూ ఖాతిక్ కమ్యూనిటీ విక్రేతల వద్ద లభిస్తుంది. అందువల్ల మల్హర్ ధృవీకరించిన విక్రేతల నుంచి మాత్రమే మటన్ కొనుగోలు చేయాలని కోరుతున్నట్టు వెబ్‌సైట్‍‌ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది : కిరణ్ అబ్బవరం

ల్యాంప్ సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్లే రిలీజ్ చేయడం సక్సెస్‌గా భావిస్తున్నాం

''బాహుబలి-2'' రికార్డు గల్లంతు.. ఎలా?

వీర ధీర సూరన్ పార్ట్ 2 లవ్ సాంగ్ లో నేచురల్ గా విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ

ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా అంటూ చిరంజీవి పలుకరించడంతో ఆశ్చర్యపోయా : హీరో నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments