Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

Advertiesment
paragliding

ఠాగూర్

, సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (16:06 IST)
దేశంలోని పలు ముఖ్య నగరాల్లో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరిగిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా, ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం వేళల్లో ఆఫీసులు, పాఠశాలలకు చేరుకోవాలంటే పెద్ద సవాల్‌గా మారుతుంది. పరీక్షల వేళ సమయానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 
 
ఈ క్రమంలa ఓ పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు ఓ విద్యార్థి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏకంగా పారాగ్లైడింగ్ చేస్తూ సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వాయి తాలూకాలోని పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహాంగడే అనే విద్యార్థి పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలి వుండగా, భారీ ట్రాఫిక్‌లో చిక్కుకునిపోతానని గ్రహించి పారాగ్లైడింగ్ ద్వారా అసాధారణ మార్గంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ వైరల్ అవుతుంది. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ విద్యార్థి తన కాలేజీ బ్యాగుతో ఆకాశంలో ఎగురూత తన పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కనిపించింది. ఇందుకోసం అతడికి పంచగనిలోని జీపీ అడ్వెంచర్స్‌కు చెందిన సాహస క్రీడా నిపుణుడు గోవింద్ యొవాలే సహాయం చేశాడు. అతడి సాయంతో విద్యార్థి తన బ్యాగుతో ఆకాశంలో ఎగురుతూ సహయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివో టి4ఎక్స్ 5జి: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. మార్చిలో విడుదల