Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దయ్యే ఛాన్స్!?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (15:53 IST)
మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్.. ఈ వార్తలకు బలం చేకూరిచ్చినట్టయింది. మహారాష్ట్రలో శాసనసభ రద్దు దిశగా రాజకీయ పరిణామాలు ఉన్నాయంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. 
 
మహారాష్ట్ర‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ల భాగస్వామ్యంతో ఏర్పడిన మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. శివసేన కీలక నేత ఏక్‌నాథ్ షిండే.. తనకు మద్దతుగా ఉన్న నేతలలో క్యాంపు రాజకీయం మొదలు పెట్టడంతో.. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. 
 
తొలుత ఏక్‌నాథ్ షిండే‌తో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టచ్‌లో ఉన్నట్టుగా ప్రచారం సాగినప్పటికీ.. ఆయనకు 30 మంది వరకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని కథనాలు వెలువడుతున్నాయి. శివసేనకు ఎమ్మెల్యే‌లతో పాటుగా,తనకు ఆరుగురు స్వతంత్రులతో కలిసి 46 మంది మద్దతు ఉన్నట్టుగా ఏక్‌నాథ్ షిండే చెబుతున్నారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments